సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ గంటలలో కొత్త ఏడాది 2025 లో అడుగుపెట్టబోతున్నాము. మరి భీమవరం పట్టణంలో రేపు బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా 2025 ఆహ్వానం పలుకుతూ ప్రజా ప్రతినిధులు ప్రజలు సందర్శనార్ధం అందుబాటు లో ఉంటామని మన సిగ్మా న్యూస్ కు తెలియజేసిన సమాచారం మేరకు.. స్థానిక ఎంపీ , కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ,స్థానిక నరసయ్య అగ్రహారం వద్ద బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి అందుబాటులో ఉంటారు. రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు గునుపూడి లోని కార్యాలయంలో ప్రజలకు ఉదయం 8గంటల నుండి అందుబాటులో ఉంటారు. అయితే తనను కలిసేవారు బొకేలు బదులు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలూ, పెన్నులు తీసుకోని వస్తే సంతోషిస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు రేపు ఉదయం 7.00 గంటల నుండి స్థానిక బ్యాంకు కాలనీ లోని శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపం నందు తన నివాసంలో అందుబాటులో ఉంటారు. అలాగే ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు భీమవరం పెద్దమిరం శివారులోని ఆయన నివాసం లో ఉదయం 8 గంటల నుండి అందుబాటులో ఉంటారు.
