సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం విష్ణుపూర్ లోని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ & డాక్టర్. బి.వి. రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విష్ణు విద్యా సంస్థల విద్యార్థులు మరియు సిబ్బంది కొరకు నేడు, శుక్రవారం మరియు రేపు (జనవరి 6 & 7 తేదీలలో) సంస్థ ప్రాంగణంలోని విమెన్స్ ప్లే గ్రౌండ్ నందు ‘విష్ణు సంక్రాంతి సంబరాలు 2023’ ను నిర్వహించడం జరుగుతుంది.ఈ సంబరాల్లో భాగంగా ఒక ‘ఫుడ్ ఫెస్ట్’ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో తెలుగు వంటకాలు, రుచులు ఉట్టిపడేలా సుమారు 30 కు పైగా వివిధ ఫుడ్ స్టాల్స్ ను, గేమ్ జోన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులు నిర్వహించబడే ఈ సంక్రాంతి సంబరాలునేటి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8-30 గంటల వరకు అందమైన లైటింగ్ కాంతులలో నిర్వహించారు. రేపుశనివారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 8-30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. తెలుగు పండుగల శోభ ఉట్టిపడేలా హరిదాసు, గంగిరెద్దులు, పిట్టల దొర, సోది, కొమ్మదాసుల లాంటి సుమారు 30 రకాల వేషధారులు, కోలాటం, గుర్రపు స్వారీ, ఆవులు, ఎద్దులు బండి, రంగులరాట్నం, జాయింట్ వీల్, మరియు స్కూల్ విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏంతో కోలాహాలంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *