సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఇటీవల జరిగిన ఎన్నికల్లో MLC గా ఎన్నికైన కైకలూరు కు చెందిన జయమంగళం వెంకటరమణ నేటి. సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్. కొయ్యే మోషేను రాజుని, భీమవరం గునుపూడిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు ఈసందర్భంగా శ్రీ కొయ్యే మోషేను రాజు MLC గా ఎన్నికైన జయమంగళం వెంకటరమణ గారికి శుభాకాంక్షలు తెలిపి. గతంలో ఎమ్మెల్యే గా అనుభవం కూడా ఉన్న మీరు శాసన మండలిలో కీలక పాత్ర పోషించి సీఎం జగన్ మీఫై, ప్రజలు పెట్టుకొన్న నమ్మకం నిలబెట్టాలని సూచించారు. ఇక కైకలూరు సమీపంలో గల మణుగునూరు గ్రామ దళిత సంఘాల నాయకులు నేటి సాయంత్రం శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ని వారి కంమ్యూనిటీ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది.
