సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 వ టౌన్, గోవర్ధన్ టాకీస్ రోడ్ DCMS ఆఫీస్ యందు పశ్చిమ గోదావరి జిల్లా,DCMS చైర్మన్ వేండ్ర వెంకట స్వామి ఆధ్వర్యంలో నూతనంగా DCMS జనరిక్ మెడికల్ షాపును నేటి శుక్రవారం ఉదయం భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిధిగా శాసనమండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజు హాజరయ్యారు. ఈ సందర్భముగా వారు, DCMS ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా అందరికి అందుబాటులో భీమవరం నడిబొడ్డున ప్రధాన సెంటర్లో తక్కువ ధరకు నాణ్యతతో కూడిన జనరిక్ మందులు అమ్మే మెడికల్ షాపును ఏర్పాటు చేసిన వేండ్ర వెంకట స్వామిని అభినందించారు. సీనియర్ వైసిపి మహిళా నేత గూడూరి ఉమాబాల చేత షాపులో ఒక సెక్షన్ ప్రారంభించడం కోసం స్వయంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, రిబ్బన్ కత్తెర ప్లేటులో అందించడం విశేషం. ఈ కార్యక్రమం లో DCMS మేనేజర్ k. నాగమోహన్ రావ్ zptc కాండ్రేగుల నరసింహ రావు , AMC చైర్మన్ తిరుమని ఏడుకొండలు , తోట భోగయ్య , ఏ ఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు..
