సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: స్తూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఐ.ఓ.) జాతీయస్థాయి విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న ‘ఓ యువత మేలుకో! సమస్యలను జయించి, నీ భవిష్యత్ నిర్మించుకో’అనే ఉద్యమంలో భాగంగా నేడు, మంగళవారం భీమవరం పట్టణంలోని సి.ఎస్.ఎన్. కాలేజీలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆప్కా సిద్దీఖ్ మాట్లాడుతూ.. నేడు విలువలతో కూడిన విద్య చాలా అవసరమని, విద్యార్థులు నైతిక విలువలను పాటించినప్పుడే వారు ఆదర్శ పౌరులుగా తయారవుతారని, అప్పుడే యువత వల్ల దేశానికి లాభం జరుగుతుందని అన్నారు. నేడు పరుగు ప్రపంచంలో యువత అనేక రకాల ఆందోళన, ఒత్తిడిలకు గురై ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు నెగ్గడం మాత్రమే బోధిస్తున్నారని, ఒకవేళ ఓటమి ఎదురైతే దానిని ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పాలన్నారు. యువత మద్యం, జూదం, డ్రగ్స్ సేవనం, ఆశ్లేల చిత్రాల వీక్షణం లాంటి అనేక చెడు వ్యసనాలకు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు తప్పనిసరిగా నైతిక విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై, అటు అధ్యాపకులపై కూడా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఏన్. కాలేజి ప్రిన్సిపాల్ సలీం ఖాన్ , ఎస్.ఐ.ఓ. బాధ్యులు అనస్, సభ్యులు ఆఖిల్ ,సుభాని, సమీర్ సి.ఎస్.ఎన్. కాలేజి ఇంటర్ విద్యార్థి, విద్యార్థినిలు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
