సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారి ఆదేశానుసారం నేడు డిసెంబర్ 29 న సోమవారం నాడు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో( ఇకపై ప్రజలకు అందుబాటులో పిర్యదులు కార్యాలయం మార్చారు) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ వి. భీమారావు నిర్వహించారు. బాధితుల నుండి వివిధ రకాల సమస్యలను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ఈరోజు కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం,ప్రేమ పేరుతో మోసం, ఆస్థి తగాదాలులపై మొత్తం 21 అర్జీలను అదనపు ఎస్పీ స్వీకరించారు.ఈ కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ , రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
