సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో తాజగా నేడు, శుక్రవారం 7 సభ్యులు కల గంజాయి ముఠా ను వన్ టౌన్ పోలీస్ లు పట్టుకొని డీఎస్పీ బి. శ్రీనాథ్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. డిఎస్పీ శ్రీనాధ్ చెప్పిన వివరాల ప్రకారం.. వీరిలో పాలకోడేరు గ్రామానికి చెందిన మామిడిశెట్టి సుధాకర్ ప్రధాన నిందితుడుగా గుర్తించారు. ఇతని సారథ్యంలో మరో 6గురు ముఠాగా పనిచేస్తున్నారు. వీరందరూ 25 ఏళ్ళ వయస్సుకు కాస్త అటుఇటుగా ఉంటారు. విశాఖ ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ చిన్నచిన్న పొట్లాలుగా ప్యాక్ చేసి అధిక ధరకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నారు. ఈ ముఠాను భీమవరం వన్ టౌన్ పోలీసులు శ్రీనివాసా సెంటర్ ఓవర్ బ్రిడ్జి కింద అరెస్ట్ చేశారు. రూ.1.10 లక్షలు విలువైన సరుకు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఏ. శ్రీనివాస్ ఎస్ ఐ లు ఎం వెంకటేశ్వర రావు , ఎన్ సత్యసాయి లను, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ని డీఎస్పీ అభినందించారు.
