సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారులో జాతీయరహదారిపై 24 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రవేటు ట్రావెల్స్బస్సు నేడు, సోమవారం తెల్లవారు జామున బోల్తా పడిం ది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రెవేటు ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం నుంచి భీమవరం కు వెళ్తోంది. మార్గం మధ్య లో చేబ్రోలు శివారుకి రాగానే.. బస్సు రహదారి పక్క నే ఉన్న కటౌట్ను ఢీ కొట్టడంతో ఆందోళనతో డ్రైవర్ బ్రేక్ వేయడం తో బస్సు రహదారి పక్క నే ఉన్న పొలం లోకి వెళ్లి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలో స్థానిక పోలీసులు సీఐ శ్రీనివాస్, ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వా సుపత్రికి తరలిం చారు.
