సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత రాత్రి స్థానిక ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో వేలాది స్టూడెంట్స్ ప్రజల మధ్య సంక్రాంతి కి వస్తున్నాము సినిమా బ్లాక్ బ్లాస్టర్ స్టార్ నైట్ అపూర్వముగా జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్, భీమవరం బులిరాజు రేవంత్ సందడి మాములుగా లేదు.. అయితే గతం లో ఎక్కడ లేని విధంగా వెంకీ మామ అక్కడ స్టేజి ఫై కాలేజీ కుర్రాడిలా ఇద్దరు హీరోయిన్స్, సింగెర్స్ తో కలసి చెలరేగి ఆడాడు.డాన్స్ చేసాడు. అదురు బెదురూ లేకుండా పంచ్ లు వేసాడు…వెంకీ మాట్లాడుతూ.. మీ భీమవరం వాళ్ళు ముఖాలు చుస్తే ప్రపంచంలోని ఆనందం అంత మీలోనే కనిపిస్తుంది. మీ లోపల మనస్సు కూడా స్వచ్ఛముగా కనిపిస్తుంది.. సంక్రాంతి కి వస్తున్నాం సినిమా మొదటి ప్రమోషన్ ఇక్కడే మొదలు పెట్టాలని అనుకొన్నాం.. కానీ విజయోత్సవం చేస్తున్నం..ఈ సినిమా హిట్ అవుతుందని తెలుసుకానీ, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని 300 కోట్ల వరకూ తీసుకెళ్తుందని అస్సలు ఊహించలేదు.( ఈ సినిమా భీమవరంలోనే ఏకంగా కోటిన్నర దాటేసింది. 2 కోట్ల వరకు వసూళ్లు అంచనా..) మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతి వస్తాం. మరో బ్లాక్‌ బస్టర్‌ ఇస్తాం. హిట్‌ చేసిన అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్‌. ప్రబాస్ ది భీమవరమే కదా ..ఆయనతో కూడా అనిల్ రావిపూడి సినిమా తీస్తాడు ’’ అని వెంకటేశ్‌ అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు కొద్దీ సేపు ఉన్నారు. స్టేజి ఫై డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, తనదయిన స్టైల్ లో కుర్రాళ్లను ఉత్సహపరుస్తూ, వెంకటేష్ ను చిత్ర యూనిటీ ని అభినందిస్తూ మాట్లాడారు. టీడీపీ జిల్లా అడ్జక్షుడు రామరాజు , కైకలూరు ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *