సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం వాసవి జాగృతి V.J.F. నూతన క్లబ్ & కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం భీమవరం ప్యాడి& రైస్ మర్చంట్ భవనం నందు నేడు,ఆదివారం నిర్వహించారు. క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరివీధి వేణుగోపాల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి జాగృతి VJF భీమవరం క్లబ్ అధ్యక్షునిగా పర్రిపాటి BBSN గుప్త (పర్రిపాటి శ్రీను), కార్యదర్శిగా సబ్బిశెట్టి శ్రీనివాస్ గణేష్, కోశాధికారిగా సంకా అనంత గోపాలం (సంకాగోపి) నియమితులయ్యారు. ఈ సందర్భంగా తిరివీధి వేణుగోపాల్ మాట్లాడుతూ వాసవి జాగృతి క్లబ్ ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ, శాంతి, సహనం, స్నేహం వంటి ఆశయాలతో ముందుకు సాగుతుందన్నారు. క్లబ్ అధ్యక్షుడు పర్రిపాటి శ్రీను మాట్లాడుతూ.. నూతన మరియు సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగసూరి మురళీమోహన్రావు, డి.వి.ఎస్. చంద్రజి, పువ్వాడ మూర్తి ,ఉప్పల మూర్తి, కొల్లిపర పాపారావు, సమయమంతుల నాని, నూలి ప్రసాదు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
