సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం స్థానిక మార్కెట్ యార్డులో నేడు, గురువారం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన వేలాది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ … గతంలో దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యా రంగానికి ఊపిరి పోస్తే .. నేడు ఆయన తనయుడు, సీఎం జగన్ విద్యారంగంలో దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో విద్యారంగ అభివృద్ధికి వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారని అన్నారు.పాఠశాలలో ఇంగ్లిష్ విద్యతో పాటు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ , జగనన్న విద్యా కానుక, జగనన్న విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి విద్యార్థికి మేనమామ గా మారిపోయారు అన్నారు. నాడు నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. భీమవరం నియోజకవర్గ పరంగా ఎనిమిదో తరగతి చదువుతున్న 2,007 మంది విద్యార్థులకు, రెండు వందల మంది ఉపాధ్యాయులకు 6 కోట్ల 62 లక్షల పదివేల రూపాయల విలువ గల ట్యాబులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు . ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ 14 వేల 500 ఉండగా, బైజుస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ విలువ రూ 15 వేల 500 ఉందని, మొత్తం ట్యాబ్ విలువ 30 వేలు అని ఆయన స్పష్టం చేశారు. కేవలం స్థితిమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని, రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ ఉచితంగా కల్పించడం జరిగిందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, తాసిల్దార్ వై రవికుమార్, బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్, పేరిచర్ల సత్యనారాయణ రాజు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, రాష్ట్ర ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొప్పర్తి సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
