సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాఠశాలలో విద్య బుద్దులు, జ్ఞానం బోధించాల్సిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని(15)కి ప్రేమ పాఠాలు నేర్పటం మొదలుపెట్టాడు..చివరికి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆమెకు తాళి కట్టి పెళ్లైందని చెప్పి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజగా వెలుగులోకి వచ్చింది. పశ్చి మగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు ఇక్కడ సమీపంలోని ఉండి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఒక హైస్కూల్ లో హిందీ మాస్టర్ గా పనిచేస్తున్నారు. తనదగ్గర చదువుకొంటున్న ఒక మైనర్ అమ్మాయి ఫై కన్నేసి, పెళ్లి చేసుకుంటున్నానని మాయమాటలు చెప్పి ఆ విద్యార్థినిని ఈ నెల 19న బైకు పై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. అక్క డే తాళి కట్టి పెళ్లైందని చెప్పి , ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు అని… ఈ మేరకు గత బుధవారం బాధితురాలు ఇచ్చి న ఫిర్యా దు మేరకు సోమరాజుపై అత్యాచారం, ఫోక్సో , బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు గత రాత్రి పోలీసులు ప్రకటించారు. ఈ కేసు దర్యా ప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృ ష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీ చేసారు.
