సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ మరియూ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం లోని డ్రోన్ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ నందు నేడు, సోమవారం (30.09.2024న) గరుడ ఇండియన్ హ్యాకథాన్ జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.మంగం వేణు తెలియజేశారు. భారతదేశంలో డ్రోన్‌ల తయారీలో అగ్రగామిగా ఉన్న గరుడ ఏరోస్పేస్ తో ఒప్పందం కలిగివుండటం తమకు ఎంతో గర్వకారణం అని తెలియజేస్తూ, ఈ హ్యాకథాన్ విద్యార్థుల మధ్య సృజనాత్మకత, సహకారం, మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి మరియు డ్రోన్ సాంకేతికత ద్వారా వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది అని తెలియజేశారు. భీమవరం టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. కాళీ చరణ్ జిల్లా స్థాయిలో నిర్వహించిన డ్రోన్ పోటీలలో విజేతలకు చెక్కులను అందజేశారు. మొదటి బహుమతిగా లక్ష రూపాయలు నగదు బహుమతి పొందిన విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెస్క్యూ డ్రోన్ టీమ్ మెంబెర్స్ ని మరియు రెండవ బహుమతిగా యాభై వేల నగదు బహుమతి పొందిన విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మెడికల్ డెలివరీ డ్రోన్ టీమ్ మెంబెర్స్ ని అభినందించారు. ఈ హ్యాకథాన్ పోటీలలో 7 వేర్వేరు కళాశాలల నుండి మొత్తం 62 బృందాలు పాల్గొన్నాయని, అన్నారు.ఈ కార్యక్రమంలో గరుడ అకాడమీ సీనియర్ అసోసియేట్ మేనేజర్ డాక్టర్ జి మారుతీ ప్రసాద్ యాదవ్, గరుడ ఏరోస్పేస్ మేనేజర్ (ఆర్ అండ్ డి) డి.జె. కిరణ్ గాబ్రియేల్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీలక్ష్మి, ఆర్ అండ్ డి డీన్ ప్రొఫెసర్ ఎన్ పద్మావతి, డీన్స్, వివిధ విభాగాధిపతులు, విద్యారులు పాల్గొన్నారు.
