సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ది. “ఆర్ అండ్ డి సోకస్” కార్యక్రమం కళాశాల డైరెక్టర్ & ప్రిన్సిపాల్ డా. దళిక సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేడు, శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనతి కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్స్ లో శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని తెలియజేసారు. కళాశాల అభివృద్ధిలో ఆర్ అండ్ డి కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. విష్ణు మేనేజ్ మెంట్ అందిస్తున ప్రోత్సాహకాలను విద్యార్థులు మరియు అధ్యాపకులు సక్రమంగా వినియోగించు కోవాలి అని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విష్ణు -ఇన్నోవేషన్ సెంటర్ డీసీ ఆర్ అండ్ డి. డా. రాజు ఏడ్ల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కళాశాలల్లో తొలిసారిగా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ ఆర్ అండ్ డి డా.ఎస్. పద్మావతి మాట్లాడుతూ “Ph.D. అభ్యసిస్తున్న అధ్యాపకుల ప్రదర్శనలు “పరిశోధన పత్ర ప్రదర్శన “, “పోస్టర్ ప్రదర్శన “ప్రాజెక్ట్ ఎక్స్పో, “మీ ఆలోచనను పిచ్ చేయండి.” వంటి ఐదు ఈవెంట్లను అధ్యాపకులకు మరియు విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్నాము అని అన్నారు. . ఈ ఈవెంట్లో మొత్తం 400 మంది అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.కె. శ్రీనివాస్, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *