సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం . డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ “మెటీరియల్స్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ICMISI 2024)” అను అంశం పై రెండు రోజుల (2 – 3 ఫిబ్రవరి 2024) అంతర్జాతీయ సదస్సును హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తోంది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేసారు.ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ మీద స్టూడెంట్స్, ఇంజనీర్లు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశంగా పర్కోంటూ, ప్రపంచం లోని ఆధునిక సంకేతికతను వాటి వినియోగాన్ని వివిధ రంగాల నుండి వచ్చిన నిపుణుల ద్వారా తెలుసుకొని, ఆచరించి కాలానుగుణంగా నిర్మాణరంగంలో మార్పులు తీసుకుని రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్, హైదరాబాద్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డాక్టర్. ఎం. వీ. రవిబాబు గెస్ట్ ఆఫ్ హానర్ గా విచ్చేసిన అడ్డిస్ అబాబా యూనివర్సిటీ, ఇథియోపియా, డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్ అఫ్ ఎర్త్ సైన్సెస్, ప్రొఫెసర్ డాక్టర్ కె సూర్య భగవాన్ తదితరులు పాల్గొన్నారని కళాశాల డైరెక్టర్ డా.దశిక సూర్యనారాయణ తెలిపారు. .
