సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మార్చి 2024 నెలలో నిర్వహించబోనున్న జాతీయ స్థాయి ‘ఎలక్ట్రిక్ బాజా ఛాంపియన్‌షిప్ 2024’ (ఆఫ్-రోడ్) కొరకు ఈరోజు ‘శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ’ వారు ‘బాజా ఎస్.ఏ.ఇ. ఇండియా’ సంస్థ వారితో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తమ భీమవరం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అవగాహనా ఒప్పంద సంతకాల కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు , ‘బాజా ఎస్.ఏ.ఇ. ఇండియా’ చైర్మన్ శ్రీ సంజయ్ నిబంధే తో, కలసి ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేయడం జరిగింది. ఈ 4-రోజుల ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ ATV ఛాంపియన్‌షిప్‌లో,దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులచే తయారు చేసిన ఆధునిక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క విశ్వసనీయతను మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాలను తనిఖీ చేయడానికి సాంకేతిక తనిఖీ, బ్రేక్ టెస్ట్, యాక్సిలరేషన్ టెస్ట్, యుక్తి పరీక్ష, స్పెషాలిటీ ఈవెంట్, ఫైనల్ ఎండ్యూరెన్స్ వంటి వివిధ మూల్యాంకన ఈవెంట్‌లు నిర్వహించబడతాయని తెలియజేసారు. విజేతలకు వివిధ విభాగాల్లో వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులు అందజేయబడతాయన్నారు.ఇప్పటికే మొత్తం 85 జట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని, ఇందులో ఒక్కో జట్టులో 25 మంది సభ్యులు ఉంటారని తెలియజేశారు
