సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సంక్రాంతి పెద్ద పండుగ నేపథ్యంలో నేడు, గురువారం బయట ప్రాంతాల నుండి తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా అతిధులు వేలాదిగా తరలి రావడంతో ఈసారి ప్రధాన రోడ్డులు మాత్రమే కాదు పట్టణం లోపల అన్ని సందులు కూడా వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. తమ సందులలో నుంచి ఇంతా ట్రాఫిక్ భారీ కారులు ఆగి ఆగి ట్రాఫిక్ లో ఇరుకొనిపోయి వెళ్ళటం ఎప్పుడు చూడలేదని ప్రజలు విస్తుపోతున్నారు. ఈసారి సంక్రాంతికి శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు, కోడిపందాలు, జూదాలు మాత్రమే కాకుండా ఆట పాట , ఆటలా పోటీలు. మనిషికి 2,500 కడితే చాలు ఆకాశంలో విహరహానికి ఎగిరే గైడోర్, బిలూన్స్ వంటి ఆకర్షణీయమైన సాహస విన్యాసాలు ఇలా స్థానిక ఎక్కడ కూటమి నేతల ఆధ్వర్యంలో కొందరు వైసీపీ నేతల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చెయ్యడం తో వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు ప్రముఖులు, ఎమ్మెల్యే లు ఎంపీలు, మంత్రులు భీమవరం వెళ్ళటం ప్రతిష్టాకర విషయంగా భావించి గత 3 రోజులుగా తరలివస్తుండటం తో ఎక్కడ వారికీ వారి సిబ్బంది కి సరిపడ్ద లార్డ్స్ గెస్ట్ హౌసులు ఎంత డబ్బు ఇచ్చిన సరిపెట్టలేని పరిస్థితి. వాహనాల పార్కింగ్ సరిపోక భీమవరం ప్రధాన రోడ్లకు ఇరువైపులా రాత్రులు వాహానాలను పార్క్ చేసి ఎక్కడక్కడో అతిధులు విందులు వినోదాలలో పాల్గొని పండగను మస్తు ఆహ్లదంగా గడుపుతున్నారు. ఉదయం పూట వాహనాలు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం పరిస్థితిని అంచనా వెయ్యలేకపోతున్నారు.స్థానిక ప్రధాన . అంబేద్కర్‌ సెంటర్‌లో వాహనాలను పట్టణంలోకి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి గరగపర్రు రోడ్డులోకి, గొల్లవానితిప్ప రోడ్డులోకి మళ్ళించడంతో రద్దీ మరింత పెరిగింది.దిరుసుమర్రు రోడ్డులో భారీ పందాల బరులు ఉండటంతో కిలో మీటర్ల ట్రాఫిక్ జాం అవుతుంది. మరో 2 రోజులు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. స్థానిక హోటల్స్, రెస్టారెంట్లు వచ్చినవారికి సర్వీస్ ఇవ్వలేక ఆన్ లైన్ సర్వీసులు పూర్తిగా రద్దు చేసుకొన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *