సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల ఎంపిక ను టీడీపీ జనసేన ప్రకటించినప్పటికీ ఇంకా వారిలో ఎన్నో సంశయాలు వెంటాడుతున్నాయి. ఎంపీ రఘురామా కు బీజేపీ నరసాపురం ఎంపీ టికెట్ నిరాకరించడం.. బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస వర్మకు కేటాయించడంతో కూటమి అభ్యర్థులు మిన్ను విరిగి మీద పడినట్లు నామినేషన్స్ సమయానికి ఇంకా ఎన్నో చేర్పులు మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. ఒక వేళా రఘురామా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాలనుకొంటే జిల్లాలో కూటమిలోని అభ్యర్థులలో ఎవరి సీటు సమర్పించుకోవాలో? ఆందోళలన కూడా వారిలో ఉంది, ఇదిలా ఉండగా ఎంపీ రఘురామా, భీమవరం పట్టణ శివారులోని తన నివాసంలో తన సన్నిహితులతో, కూటమి పార్టీల నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో కూటమి పార్టీలు తనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పిస్తాయని ఆశాభావం తో ఉన్నారు. ఎంపీ రఘురామా మీడియా తో మాట్లాడుతూ.. ‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ న్యాయస్థానానికి వాయిదాలు కోరుతూ అసలు వెళ్లకపోవడం తో బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో మరొక పిటిషన్ వేశా’ దీనిపై సుప్రీం కోర్టులో ఏప్రిల్ 1న విచారణ జరుగుతుంది.. హైకోర్టు, సుప్రీం కోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా పోరాటం చేస్తున్నా.. వై.ఎస్ జగన్ నాకు టికెట్ రాకుండా తాత్కాలికంగా అడ్డుకొన్నారు కానీ ఎన్నోసారులు నా విషయంలో ఫెయిల్ అయ్యారు. నన్ను ఎంపీగా డిస్క్వాలిఫై చేయలేకపోయారు. చంపలేక పోయారు. ఎన్ని కుట్రలు చేసిన నేను బహుశా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఫై వివరణ మరో 4 రోజులలో తేలవచ్చు అన్నారు. చంద్రబాబు , పవన్ నాకు అన్యాయం చేయరు. ప్రధాని మోదీ కూడా జగన్మోహన్రెడ్డిని ప్రేమించరు అనేది నా ప్రగాఢ నమ్మకం .. నాకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయి అన్నారు రఘురామా కృష్ణంరాజు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *