సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం నుండి పోటీ చెయ్యడం ఒక విశేషమైతే ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యడం విశేషం అయితే.. వారిరువురి పరాజయం మరింత సంచలనం రేపింది తెలుగు రాష్ట్రాలలో … రాజకీయ పార్టీలకు అతీతంగా భీమవరం ప్రాంతంలోని నేతలు ఎప్పడు దేశరాజకీయాల్లో సంచలనం రేపుతూనే ఉంటారు ఎప్పుడు.. గత చరిత్రలో ఎందరో నేతలు.. ఇక మరో 6 నెలలులో లోక్ సభకు శాసన సభకు ఒకేసారి మరో సారి ఎన్నికలు సమీపిస్తున్న వేళా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం వేదికగా అసెంబ్లీ, లోక్ సభ కు పోటీ చెయ్యబోతున్న నేతల పట్ల ఇప్పటికే చాల క్లారిటీ వచ్చేసింది. ఆఖరి సమయంలో ఏమైనా ఊహించని మార్పులు ఉంటె తప్ప.. ఇక భీమవరం నియోజకవర్గంలో జనసేన నుండి పవన్ కళ్యాణ్ అధికార వైసిపి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి తలపడటం దాదాపు ఖాయం.. నరసాపురం ఎంపీ స్థానానికి మరోసారి తానే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ప్రస్తుత వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణంరాజు ప్రకటించారు. అయితే ఆయనకు దీటుగా ఈసారి అదిరిపోయే మరో ట్విస్ట్ ఏమిటంటే ..ఆలిండియా సూపర్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ, శ్యామల దేవి ఈసారి వైసిపి బరిలోకి దిగుతుందని తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎంపీ మిదున్ రెడ్డి తదితర వైసిపి పెద్దలు అందుకు కార్యాచరణ పూర్తీ చేసారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు..ఈ ప్రాంతానికి చెందిన వారు.. భార్య శ్యామల దేవితో కలసి ఇక్కడే భీమవరం జేపీ రోడ్డు లో 6ఏళ్ళు నివాసం ఉండిన కృష్ణంరాజు గతంలో ఇక్కడి నుంచే బీజేపీ ఎంపీగా గెలచి కేంద్ర మంత్రిగా హావ సాగించారు. ఇప్పుడు ఆ ప్రతిష్ట ను మరోసారి కొనసాగించడానికి.. రాజకీయ అవగాహన, మంచి మనిషిగా పేరున్నఆయన భార్య శ్యామల దేవి బరిలోకి దిగితే.. ఆమె గెలుపు కోసం అన్ని వర్గాలు ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేస్తారని వైసిపి మరియు, ప్రభాస్ అభిమానుల అంచనా.. అయితే ఆమె ఒకవేళ ఎన్నికలకు దూరం అని ప్రకటిస్తే మాత్రం.. వైసీపీ తరపున మాజీ బీజేపీ ఎంపీ గంగరాజు ఫ్యామిలీ నుండి అయన కుమారుడు రంగరాజు లేదా సోదరుడు గోకరాజు రామరాజు ను బరిలో దింపే ఆలోచనలో వైసిపి ఉన్నట్లు తెలుస్తుంది. ఎంపీ రఘురామా కృష్ణంరాజు కూడా తనతో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పోటీకి దిగితే మంచిదే.. నని గౌరవ పూర్వక ఆహ్వానం పలకడం మరో విశేషం.. ఏది ఏమైనా భీమవరం అంటేనే ఒక భారీ లాజిక్ కదా!
