సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి గరగపర్రు గ్రామం లో తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వైపు వెళుతున్న కారుల ను ఆపి పోలీసులు తనిఖీ చేస్తుండగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్య క్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేసి అందులో అక్రమంగా తరలిస్తున్న 25.5 కిలోల గంజాయి స్వా ధీనం చేసుకున్నారు. ఆ 5గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సీహెచ్సురేష్, పి.ఉమామహేశ్వరరావు, పి.కిరణ్ బాబు, డి.పూర్ణచం ద్రరావు, బి.సత్య స్వ రూపపై కేసు నమోదు చేసినట్లు ఎస్సైతెలిపారు. సీఐ నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
