సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో సం క్రాంతి పండుగకు ఉండే సందడి అంత ఇంతాకాదు. అందుకే ఎక్కడెక్క డో స్థిరపడిన వారు సైతం పండగకు సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. వారి ప్రయాణాలకు రైళ్లు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సు సర్వీసులు సరిపోవు. గతానికి బిన్నంగా ఏపీ ఆర్టీసీ పండుగ వేళలలో అదనపు చార్జీలు ఈ సారి వసూళ్లు చేయడంలేదు. పశ్చి మ జిల్లా పరిధిలో భీమవరం ,నరసాపురం, తాడేపల్లిగూడెం , తణుకు డిపోల పరిధిలో పండగకు ప్రతి రోజూ అదనంగా ఎనిమిది బస్సులను నడుపుతున్నారు. వీటితో పాటు విజయవాడ నుంచి ఒక్కో డిపో పరిధిలో నాలుగు సూపర్ లగ్జారీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అయిన సరిపోవు. తెలంగాణ ,హైదరాబాద్ నుండి భీమవరం వైపు అయితే ఎన్ని ప్రవేటు వాహనాలు వేసిన ప్రయాణికుల నుండి డిమాండ్ తగ్గదు. గతానికి బిన్నంగా ఏపీ ఆర్టీసీ పండుగ వేళలలో అదనపు చార్జీలు ఈసారి వసూళ్లు చేయడంలేదు. అయితే ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఒకటికి నాలుగు రేట్లు ఇదే సీజన్ లో సంపాదించాలని . ప్రైవేటుట్రావెల్స్ యజమానులు కొందరు భారీ స్థాయిలో అదనపు చార్జిలు వసూళ్లు చెయ్యడం ఇప్పటినుండే మొదలు పెట్టేసారు. దీనిపై రవాణా శాఖ అధికారులు నేటి మంగళవారం నుండి ప్రత్యే క డ్రైవ్ నిఘా చేపడుతున్నారు. ‘ఈ నెల 10న ఉదయం నుం చి 18 వరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రత్యే క తనిఖీలు చేపట్టనున్నాం. అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు తేలితే రూ.10వేల జరిమానాతో పాటు బస్సును కూడా సీజ్చేస్తాం అని హెచ్చరించారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మార్గాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేసినట్లు రవాణా శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరరావు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *