సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి తాడేపల్లి గూడెం వరకు సుమారు 35 కిమీ మీటర్లు రోడ్డు గత 2 దశాబ్దాలు పైగా ఎంతగా దెబ్బతిని ఎంత దుర్భరంగా మారిందో ప్రయాణికుల్లకు అందరికి తెలిసిందే. అయితే గత ప్రభుత్వ పాలనలో తాడేపల్లి గూడెం నుండి పిప్పర వరకు మాత్రం రోడ్డు వేశారు. భీమవరం నుండి విష్ణు కాలేజీ వరకు సుమారు 3 కిమీ రోడ్డు వేశారు. అయితే గత ఏడాదిగా పిప్పర నుండి భీమవరం వరకు రోడ్డు ఇబ్బందులు ప్రయాణికులకు తప్పలేదు. దీనిపై తాజగా నేడు, గురువారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుభవార్త చెప్పారు. తన విజ్జ్ప్తి మేరకు భీమవరం నుండి పిప్పర వరకు రోడ్డుకు కేంద్ర మంత్రి నితిన్ గట్కారీ 56 పైగా కోట్ల రూపాయలను మంజూరు చేసారని, అలాగే భీమవరం నుండి లోసరి రోడ్డుకు 44 కోట్ల రూపాయలు మంజూరు చేసారని దీనితో 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యి మన ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా మన పడుతున్న ప్రధాన రోడ్ల ఇబ్బందులు తొలగనున్నాయని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సమక్షంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రకటించారు.
