సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వైసీపీ కార్యాలయంలో నేడు, మంగళవారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 196 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అడ్జక్షులు కోడే యుగంధర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు తోట. భోగయ్య, కామన నాగేశ్వరరావు, నల్లం.రాంబాబు, గంటా.సుందర్ కుమార్, పెచ్చేటి.ప్రసాద్, నత్రన్. భాష మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలె వెనుకబడిన వర్గాల ప్రజలకు అణగారిన ప్రజలు జీవితాలలో వెలుగులు నింపడానికి చేసిన పోరాటం అసామాన్యం అని, ఇప్పుడు అదే స్ఫూర్తి తో దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని రీతిలో సీఎం జగన్ మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమ నాయ్యం జరిగేలా సాహసోపేత నిర్ణయాలు తీసుకోని, పదవులు ఎంపికలో , సంక్షేమ పధకాలు కచ్చితంగా అమలు చేస్తున్నారని సామజిక సమానత్వం అమలుకు చేస్తున్న కృషి ప్రసంశనీయం అన్నారు.
