సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనం లో మాజీ అడ్జక్షులు మానేపల్లి సత్యనారాయణ గుప్త అడ్జక్షతన భీమవరం వ్యాపారస్తులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేతలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి, ముత్యాల వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. భీమవరం ప్రజలతో, మీ వర్తకులతో నా అనుబంధం అందరికి తెలిసిందే.. నేను ఆర్ధికంగా అతి సామాన్యుడను.. మధ్య తరగతి కుటుంబం వాడిని.. అయితే నేను 34 ఏళ్ళు బీజేపీ జెండా మోస్తూనే ఉన్నానని గమనించిన ప్రధాని మోడీ నా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసారు. నువ్వు గెలచి ఢిల్లీ రా ! నిన్ను ఎక్కడ పెడతానో చుద్దవు కానీ అని మొన్న రాజమండ్రి సభలో భరోసా ఇచ్చారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 7 నియోజకవర్గాలలో పర్యటిస్తున్నాను .ప్రజల నుండి టీడీపీ జనసేన పార్టీల నుండి విశేష స్వాందన వస్తుంది. రేపు ఎంపీ అయ్యాక కూడా ఎటువంటి అహకారం లేకుండా మీ వర్మ గానే ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబు ను కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *