సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులోని రాయలం బైపాస్ రోడ్డు వైపు ఉన్న భారీ అపార్ట్మెంట్ల దగ్గర నేటి ఆదివారం మధ్యాహ్నం 2న్నర గంటల సమయంలో ఒక గోడౌన్ లో వేస్టు మెటీరియల్ అంటుకోవడంతో అగ్ని మంటలు రాజుకొన్నాయి.ఆ గౌడౌన్ లో పాత ప్లాసిక్ సామాను, వెస్ట్ పేపర్ కొనుగోలు చేసి అక్కడ భద్ర పరచడంతో.. ఈ మంటలతో దట్టమైన పోగలతో, ఆ వాసనకు చుట్టుపక్కల సుమారు కిలోమీటర్ మేర అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులుకు గురి కావడంతో .. స్థానికుల పిర్యాదు మేరకు ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి రెండు ఇంజన్ల సహాయంతో కొద్దీ సమయంలో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తీరు పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *