సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి , బుధవారం సాయంత్రం భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచా రామం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల దేవస్థానం ధర్మ కర్తల మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ తో పాటు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. శ్రీ సోమేశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి కోడె విజయలక్ష్మి కి మరియు మిగతా ధర్మకర్తల మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వేండ్ర వెంకట స్వామి , బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరావు మరియు ZPTC లు MPTC లు వైసిపి నాయకులు పట్టణ ప్రముఖులు, దేవాలయ ఇఓ, ఎం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
