సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మారుతి సెంటర్ లో దశాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మ కర్తల మండలి సభ్యులు బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును నేడు, బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, యర్రంశెట్టి గౌతమ్, యియ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధ లు నియమితులయ్యారు. ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *