సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారి 44వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలు ను నేటి ఉదయం స్వామివారి దర్శించుకొని గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. పూజలు, వ్రతాలు హిందూ సంప్రదాయంలో ఒక భాగమని, మృగశిరా నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనదని, మార్గశిర మాసంలో హనుమంతుని ఆరాధనకు విశిష్టమైనదని, హనుమంతుని యథాశక్తి పూజిస్తే భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందవచ్చునని అన్నారు ఇక్కడ 44 ఏళ్లుగా శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలను సంప్రదాయ బద్దంగా 7 రోజులపాటు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
