సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం పేరు కు కారణమైన సుమారు 1200 యేళ్ళనాటి అతి పురాతన దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలగా నియమించబడిన నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా గనిరెడ్డి త్రినాధ్ మరియు ధర్మకర్తలు నేడు, గురువారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని, రాష్ట్ర టీడీపీ కోశాధికారి మెంటే పార్థసారధిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు భీమవరం మునిసిపల్ మాజీ వైస్ చైర్మెన్ గనిరెడ్డి త్రినాద్ ను సభ్యులను అభినందిస్తూ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టనున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దర్శనాన్ని సులభతరం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తలు చింతాడ నాగలక్ష్మి నల్లం గంగాధరరావు ఆకుల హైమావతి పి.కార్తీక్ మల్లువలస రఘుబాబు ఎం.శ్రీనివాసరావు బీ.లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.
