సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని నేడు సోమవారం దర్శించుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం వాస్తవ్యులు అనంతరామ్ సత్యవాణి దంపతులు 16 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ప్రసాదాలు ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
