సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కు తెలంగాణ లోని భద్రాచలం లో వేయించేసిఉన్న శ్రీ సీతా సీతారాములు వారి ఉత్సవ విగ్రహాలతో దేవాలయ రధం నేటి శుక్రవారం రాత్రి చేరుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి పట్టణములు గ్రామముకు భక్తులకు శ్రీరామచంద్రులవారి దర్శనార్థం ఈ రధం పయనిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కు చేరుకున్నది. స్థానిక భక్తులకు శ్రీ రామదర్శనం కలిగింది. నడిచే దేవాలయంలా ఉన్న ఈ భారీ రధంతో పాటు ఇక్కడికి వచ్చిన శ్రీ భద్రాచలం సీతారాముల వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి శ్రీ మావుళ్ళమ్మవారిని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ తో పాటుగా ఈ కార్యక్రమం లో ఆలయదర్మకర్తలు ముత్యాలరామారావు, రామాయణం సత్యనారాయణ, తాళ్లపూడి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *