సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి తో పాటు భీమవరం పట్టణంలో శ్రీరాంపురం లో అత్యంత ఘనంగా సుబ్రమణ్య షష్ఠి ఉత్సవాలు జరుగుతాయి అని అందరికి తెలిసిందే. ఇక భీమవరం పట్టణంలో శ్రీరామపురం శ్రీ రామలింగేస్వర స్వామి దేవాలయంలో దశాబ్దాలుగా మహిమానిత శ్రీ సుబ్రమణ్యేశ్వరునిగా పూజలందుకొంటున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 21వరకు 5రోజుల పాటు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ సోమవారం తెల్లవారు జాము 1-30 నుండి ఉదయం నుండి శ్రీ సుబ్రమణ్య షష్ఠి సందర్భముగా వేలాది మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు వేగంగా జరిగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 19వ తేదీ న సాయంత్రం 4గంటలకు 20 అడుగుల రధం ఊరేగింపు 20న రాత్రి 7గంటలకు తెప్పోత్సవం.. లైటింగ్, సిట్టింగ్ అలంకరణలు, రోడ్డుకు ఇరువైపులా చిన్నవ్యాపారులతో భారీ తీర్ధం,మినీ ఎక్సిబిషన్, స్వామివారి కల్యాణాలు, పల్లకి ఊరేగింపులు, రధోత్సవాలు, తెపోత్సవాలతో ఈ 5రోజులు ఆలయ ఆవరణలో మంచి సందడి వాతావరణం దృష్ట్యా పోలీస్ భద్రతా ఏర్పట్లను సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *