సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం శ్రీరాంపురంలో దశాబ్దాలుగా వేంచేసి యున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయం నిర్వాహక మండలి వారు శ్రీ అమ్మవారి కి భక్తుల సహకారంతో వెండిచీర తయారు చెయ్యాలని నిశ్చయించడంతో భక్తుల నుండి విశేషంగా కానుకలు అందుతున్నాయి, దీనిలో భాగంగా నేడు, శుక్రవారం స్థానిక అమ్మవారి భక్తులు బొచ్చ మహేష్ 108గ్రాములు(నూట ఎనిమిది గ్రాములు )వెండి ని వెండి చీర కోసం కానుకగా అందించారు. .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి తాళ్ళపూడి పరమేశ్వరరావు,కమిటీ సభ్యులు రౌతు రాంబాబు పాల్గొన్నారు
