సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక 17వ వార్డులో రాధకృష్ణ మందిరం సేవకులు అధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామ నవమి ఉత్సవాలలో భాగంగా నేడు, గురువారం అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు,భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి కొటికలపూడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిమిత్తం విధి నిర్వహణ నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు, గోవిందరావు చేతుల మీదగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్,నాయకులు బండి రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు, ఆకుల శ్రీను, కత్తుల నీలెంద్ర, ఉండవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
