సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హరహర నామ స్మరణతో భీమవరం శ్రీరామ పురం లోని శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రథోత్సవం నేటి గురువారం మధ్యాహ్నం ముందుకు సాగింది. షష్టి సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామివారి (సుబ్బారాయుడు గుడి) స్వామివారి 25 అడుగుల రథోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నుంచి జంట కాలువల రోడ్డు వరకు వేలాది మంది భక్తులు రధం తాడును ను పట్టుకొని హరహర.. అంటూ రధాన్నిముందుకు లాగుతూ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. నిన్న శ్రీ స్వామివారి ని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. కిలో మీటర్ వరకు భారీ తీర్ధం, ఎగ్జిబిషన్ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి. రేపు రాత్రి స్వామివారి తెప్పొత్సమ్ జరగనుంది.
