సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేడు, సోమవారం శ్రీ సుబ్రమణ్య స్వామివారి షష్ఠి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన అత్తిలి తో పాటు భీమవరం లోని శ్రీ రామాపురం లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాలలోని శ్రీ సుబ్రమణేశ్వర స్వామి వారిని నేడు తెల్లవారు జాము 2గంటల నుండి వేలాదిగా భక్తులు భారీ క్యూ లైన్లలో దర్శించుకొంటున్నారు. ప్రత్యేక శ్రీఘ్ర దర్శనం కోసం 50 రూపాయల టికెట్స్ ఫై కూడా విశేషంగా భక్తులు దర్శించుకొన్నారు. దశాబ్దాలుగా మహిమానిత శ్రీ సుబ్రమణ్యేశ్వరుని దర్శించుకొని పాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ గుండు శ్రీరాములు, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి దండు వెంకట కృష్ణంరాజు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి ఇక్కడ 25 అడుగుల రధోత్సవం హైలైట్ గా నిలవనుంది. 5రోజులు పాటు భారీ తీర్ధం బాలగోపాలానికి, యువతరానికి ప్రత్యేక ఆకర్షణ.. ఆలయ ఆవరణలో భక్తుల భదత్ర లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పిర్యాదులు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. పోలీస్ లు భద్రతా ఏర్పట్లను పర్యవేక్షిస్తున్నారు.ఇక పట్టణంలో నేటి ఉదయం నుండి పలు దేవాలయంలలో విశేషంగా భక్తులు దర్శనాలు చేసుకొని స్వామివారికి పూలు,పండ్లు, వెండి పడగలు సమర్పించారు. ముఖ్యంగా గునుపూడి పంచ రామం లోను, శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలోనూ , మారుతి సెంటర్ లోని శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద భక్తుల సందడిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *