సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నిదానలకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం 28వ వార్డులో శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి 34వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా నేడు, శుక్రవారం యంగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా మహా నివేదన చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, పల్లవ రాజు, ఏకుల దుర్గారావు, ఏకుల దానయ్య, ఆంబోతుల రాము, ఆవిడి శ్రీనివాస్, బుడ్డా మావుళ్ళు తదితరులు పాల్గొన్నారు.
