సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దాతల సహకారంతో 4.5 కేజీల వెండి మకర తోరణం అందించారు. సుమారు రూ 4 లక్షల 50 వేలు విలువ చేసే వెండి మకర తోరణం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు. శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా మహోత్సవంలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జూలూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెరుమాళ్ళ శివ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవన అధ్యక్షులు వబిలిశెట్టి వేంకటేశ్వరరావు, తటవర్తి బదిరీ, పులవర్తి విశ్వనాథరావు, కన్వీనర్ బోండా నిషాంత్, మండ చంద్రశేఖర్, కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
