సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి వీ రాజు ఫౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం వారి విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ జాతీయ సేవా సమితి విభాగం (NSS) ఆధ్వర్యంలో 2024 విశ్వమేధిటేషన్ దినోత్సవం నేడు, శనివారం ఘనంగా నిర్వహించబడింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేశారు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21వ తేదీని విశ్వమేధిటేషన్ దినోత్సవంగా ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని మొదటి సారి జరుపుతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఫ్యాకల్టీ కే. గోపాల శర్మ విచ్చేసి, ధ్యానం గురించి ,అలాగే ధ్యానం ప్రాక్టీస్ చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ఫ్యాకల్టీ డా. ఉమా దేవి కూడా విద్యార్థులను ధ్యానం ప్రాక్టీస్ చేయడంపై ప్రోత్సహించారు. ధ్యాన శిబిరం అనంతరం, ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు గారు కే. గోపాల శర్మ గారిని సన్మానించారు.
