సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభకార్యాల శ్రావణ మాసం కావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దూరప్రాంతాల నుండి సైతం భక్తులు , పెళ్లి జంటలు, బందు మిత్రులతో వచ్చి విశేషంగా వచ్చి శ్రీ అమ్మవారి అస్సిసులు తీసుకొంటున్నారు. అలాగే శ్రీ అమ్మవారి ని వారింటి ఆడపడుచు గా భావించి చీర, గాజులు పసుపు కుంకుమ, మిఠాయిలతో సారె ను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి, సత్యభామ దంపతులు, కుమారుడు కిరణ్ దంపతులు నేడు, బుధవారం అమ్మవారిని దర్శించుకొని శ్రావణ మాస సారెను అందించారు. ఆలయ అర్చకులు కొడమంచిలి కొప్పేశ్వర శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారికి అందించిన సారెను అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఉంచి పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో భట్టిప్రోలు శ్రీనివాసరావు, నర్కెడమిల్లి కృష్ణమూర్తి, బొండా హనుమంతరావు, హిందూస్తాన్ సుబ్బారావు, పున్నని కన్నయ్య, కారుమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
