సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము నందు నేడు, మంగళవారము. ఉదయం గం.8.00లకు ఆలయము లోని హుండీలు లో భక్తులు గత 55 రోజులకు ( ది.26.07.2022 నుండి 20.09.2022 వరకు )శ్రీ అమ్మవారికి సమర్పించిన కానుకలు లెక్కించగా నగదు రూపేణా రూ.45,40,044/- లు ఆదాయం లభించింది. ఇతర కానుకల రూపేణా1,61,437 రూపాయలు లెక్కకట్టగా మొత్తం ఆదాయం రూ. 47,01,481/- లు గా నిర్ధారించారు. బంగారం 131-400మి॥గ్రాములు, వెండి -308 గ్రాములు, ఇక విదేశీ కరెన్సీ నోట్లు 7 వచ్చాయి. సదరు దేవస్థానము సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి, యర్రంశెట్టి భద్రజీ మరియు పర్యవేక్షణాధికారిగా కర్రి శ్రీనివాసరావు, ఇఓ, శక్తేశ్వర స్వామి వారి దేవస్థానము యలమదుర్రు, డి.వి.కృష్ణంరాజు, ఇవో శ్రీ రామలిగేశ్వరస్వామి వారి దేవస్థానము, శ్రీరామం పురం, భీమవరం -2 మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు యం. మల్లిఖార్జున శర్మ, దేవస్థానము సిబ్బంది, మరియు 85 మంది స్వచ్చంద సేవకులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
