సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మారుతి సెంటర్ లో గత 8 దశాబ్దాల పైగా వేంచేసి ఉన్న మహిమానిత శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 13వ తేదీ శుక్రవారం నుండి 19వ తేదీ గురువారం వరకు 43వ శ్రీ హనుమద్ర్వత వార్షికోత్సవాలు ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 వ తేదీన ఉదయం 11గంటల నుండి వేలాది భక్తులకు అఖండ అన్న సమారాధన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ ఉదయం 9గంటలకు శ్రీ స్వామివారి నగరోత్సవం వేడుకగా పురవీధుల గుండా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ రామా సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రతి రోజు .ఉదయం 11గంటల నుండి 1,116 కొబ్బరికాయలతో 1500 అరటిపళ్ళతో, లక్ష తమలపాకులతో పూజలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. . లైటింగ్ సుందరీకరణ, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, ప్రతి రోజు ప్రసాద విత్రణలతో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గొట్టుముక్కల నాగ సీతారామరాజు తెలిపారు.
