సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక మారుతి సెంటర్ లో 8 దశాబ్దాలకు పైగా మహిమానిత మూర్తిగా పేరొందిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24 వ తేదీ ఆదివారం నుండి 28వ తేదీ గురువారం వరకు 43వ శ్రీ హనుమద్ర్వత వార్షికోత్సవాలు ను ప్రారంభిస్తున్నారు. 24వ తేదీన ఉదయం 9గంటలకు శ్రీ స్వామివారి నగరోత్సవం వేడుకగా పురవీధుల గుండా నిర్వహిస్తారు. ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభిస్తారని ఆలయ ధర్మకర్తలమండలి సభ్యులు మరియు చైర్మెన్, పరుచూరి చిన నాగేశ్వరరావు తెలిపారు.ఉదయం 11గంటల నుండి 108 బిందెల ఆవుపాలతో, వివిధ ఫల రసాలతో పంచామృతాలతో అభిషేకాలు ప్రారంభిస్తారు,సాయంత్రం 1300అరటిపళ్ళు, సామూహిక లక్ష తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. వేడుకలలో ప్రతి రోజు ఉదయం 11 గంటలకు 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు సాయంత్రం రాపిళ్ళు తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. లైటింగ్ సుందరీకరణ, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, ప్రతి రోజు ప్రసాద విత్రణలతో వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 2న భక్తులు దాతల సహకారంతో ఆలయ ఆవరణలో ( పాత మారుతి టాకీస్ స్థలంలో) అఖండ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గొట్టుముక్కల నాగ సీతారామరాజు తెలిపారు.
