సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నాచువారి సెంటర్ లోని శ్రీపంచముఖ ఆంజనేయ స్వామివారి 9వ వార్షిక మహోత్సవాలు ఈనెల 24 న ప్రారంభమయి ఈనెల 30వ తేదీన ఉదయం అన్న సమారాధన తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, సాయంత్రం నుండి వినోద సాంసృతిక నృత్య కార్యక్రమాలతో, లైటింగ్ అలంకరణతో గునుపూడి ప్రాంతం సందడిగా ఉంటుంది. ఈ ఉత్సవాలలో భాగంగా రేపు ఆదివారం (ఈనెల 28న )ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డాక్టర్ గోవిందబాబు పర్యవేక్షణ లో ఉచిత మెడికల్ క్యాంపు,మరియు ఉచిత మందుల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహిళా ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎం అనురాధ (శ్వేతా నర్సింగ్ హోమ్) మరియు స్త్రీల యూరాలజీ నిపుణులు డాక్టర్ ఆర్ సుధా మహిళా డాక్టర్స్ చే సామాన్య పేద వర్గాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని విజ్ఞప్తి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *