సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంపట్టణం గునుపూడి ప్రాంతంలో శ్రీ సోమేశ్వర లింగం సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టించారని స్కంద పురాణంలో పేర్కొన్నారు. పవిత్ర పంచారామాలు లో ఒకటిగా ప్రసిద్ధి పొందిన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు నేడు, శుక్రవారం సూర్యకిరణాలు నేరుగా శ్రీ సోమేశ్వర శివలింగంనకు తాకిన దృశము అపూర్వముగా సాక్ష్కారించిందని దేవాలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ ప్రకటించారు.( ఫై తాజగా చిత్రాలలో ఆ అపూర్వ అరుదయిన దృశ్యాన్ని చూడవచ్చు..) భారీ స్థాయిలో ఉండే రాజగోపురం, పెద్ద ధ్వజస్తంభం దాటుకొని ,ఢమరుకంతో ఉండే త్రిసూలంను, భారీ నందీ విగ్రహాన్ని దాటుకొని శ్రీసూర్య భగవానుడు తన కిరణాలతో ..రంగులు మారుతూ చంద్రునికి ప్రతిరూపంగా భావించే శ్రీ సోమేశ్వరుని తాకడానికి ఎంత లాఘవంగా దేవాలయం గర్భ గుడిలో ప్రవేశించాడన్నది ఆలోచిస్తేనే అద్భుతం , అపూర్వము అనిపిస్తుంది. సూర్యకిరణాల తాకిడితో దివ్య తేజాస్సుతో బంగారు రంగులో మెరిసిపోతున్న దృశ్యం చూడటానికి ఓం నమః శివాయ! అంటూ భక్తులు విశేషంగా హాజరు అయ్యారు.
