సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం అలంకారం చెయ్యడానికి ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి నేడు, శుక్రవారం స్థానిక భక్తులు తాడి రమేష్ కుమార్ శ్రీమతి కరిష్మ దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు రామాయణం శ్రీనివాస్,గుసిడి నాగశిరీష,గొంతిన రమణ,యండ సత్యవతి,మిర్తిపాటి గుణేశ్వరరావు,పాపొలు ఏడుకొండలు ప్రసాదాలు ఫోటో అందచేసారు..
