సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు ఇఓ, దేవాలయ సహాయ కమిషనర్ శ్రీ దాసరి శ్రీరామ వర ప్రసాద్ మరియు అధికారి డివి కృష్ణంరాజు, దేవాలయ సిబ్బంది సహకారంతో జరిగింది. హుండీ లెక్కింపులో భక్తులు శ్రీ అమ్మవారికి తేదీ 9 -11- 2021 నుండి నేటి 5 -1-2022 వరకు సమర్పించిన కానుకలు వివరాలు ఇలా ఉన్నాయి. డబ్బు రూపంలో 38 లక్షల 29 వేల 671 రూపాయల ఆదాయం లభించగా, బంగారం 72 గ్రాములు, వెండి 91 గ్రాములు కానుకలుగా లభించాయి. ఈ నెల 13వ తేదీ నుండి శ్రీ అమ్మవారి 58 వ వార్షిక మహోత్సవాలు కు భారీ సెట్టింగ్స్ తో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *