సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, గురువారం హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం లెక్కించగా 55 రోజులకి గాను శ్రీ అమ్మవారి హుండీ నగదు 43,38, 959. రూపాయలు, బంగారం 104 గ్రాముల 400 మిల్లి గ్రాములు, వెండి 274 గ్రాములు 600 మిల్లి గ్రాములు మరియు విదేశీ డాలర్లు ఆదాయం వచ్చింది. .ఈ హుండీ లెక్కింపులో ఆలయ ప్రధానర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ, తనిఖీదారు దేవదాయ ధర్మదాయశాఖ భీమవరం వి వేంకటేశ్వరరావు మరియు కార్యనిర్వహణధికారి శక్తీశ్వరస్వామి ఆలయo కర్రీ శ్రీనివాస్ పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
