సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సంక్రాంతి సంబరాలు కు అదనపు ఆకర్షణ గ నెల రోజులు పాటు జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ శ్రీ మావుళ్ళ అమ్మవారి 59 వ వార్షికోత్సవాలు నేటి శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ అమ్మవారి విశేష పూజ తదుపరి ఉత్సవ విగ్రహంతో హంస వాహనంపై మేళ తాళాలతో పట్టణ వీధుల గుండా అంగరంగ వైభంగా నగరోత్సవం ను ప్రారంభించారు. అసలే సంక్రాంతి పండుగ కొనుగోళ్ళకు దూరప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు వాహనదారులతో పట్టణ వీధులు కిక్కిరిసిపోయి ఉన్నాయి. వారందరికీ కూడా పుర ప్రజలతో పాటు శ్రీమావుళ్ళమ్మవారి ఉత్సవ విగ్రహం దర్శనం అస్సిసులు అందుకొనే భాగ్యం దక్కింది. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేటి సాయంత్రం వరకు నిర్వహించారు.
