సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వ వార్షిక మహోత్సవాలకు గత 2 రోజులుగా భక్తులు పోటెత్తిపోతున్నారు.సంక్రాంతి పండుగ ముగియడం దూరప్రాంతాల నుండి బంధుమిత్రులు వీడ్కోలు కు ముందు శ్రీ అమ్మవారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో ఉత్సవ కమిటీ వారు ఆలయ నలుమూలల ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్స్, కళావేదిక వద్ద నాటకాలు, మ్యూజికల్ నైట్స్, ప్రదర్శనలు చూడటానికి, భారీ తీర్ధం లోఆహ్లదంగా సేదతీరడానికి వస్తుండటంతో నిన్న మంగళవారం, నేడు, బుధవారం సాయంత్రానికి భక్తులు భారీ రద్దీతో ఆలయ ఆవరణ సందడీ పెరిగింది. భక్తుల క్యూ లైన్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దాటి IDBI బ్యాంకు వైపు వెళుతుంది. భక్తులతో,యువతతో అమ్మ వారి ఆలయానికి వెళ్లే రోడ్లన్నీ సందడిగా ఉన్నాయి. వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భక్తుల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక నేటి, బుధవారం ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ సాయి భక్త సమాజం (చెరకువాడ) వారిచే భజన, సాయంత్రం నాలుగు గంటలకు పలివెల బాల (భీమవరం) వారిచే శాస్త్రీయ సంగీతం, సాయంత్రం ఐదు గంటలకు శ్యామలా నాట్యకళా అకాడమి (కైకలూరు) వారిచే కూచిపూడి, భరత నాట్యం నిర్వహించారు. , సాయంత్రం ఆరు గంటలకు బిందు అర్కెస్ర్టా (భీమవరం) వారిచే సినీ మ్యూజికల్ నైట్, రాత్రి తొమ్మిది గంటలకు వేంకటేశ్వర నాట్యమండలి (తెనాలి) వారిచే షిర్డీ సాయిబాబా మహాత్యం నాటకం నిర్వహిస్తున్నారు.
